పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0133-5 పాడి సంపుటం; 07-197

పల్లవి:
ఏల నీవు సిగ్గువడే వింతలోనను
మేలిమి యిల్లాల నీకు మించి నేనేకాదా

చ.1:
ఎక్కడఁ దిరిగినా మాయింటికే వత్తువు నీవు
తొక్కుమెట్టాడి నిన్ను దూరనేఁటికి
పుక్కట తుమ్మిదకును పువ్వులెన్ని కలిగినా
తక్కిన చుట్టుపు పొందు తామరే కాదా

చ.2:
తలఁపు నీకేడనున్న తనువు నాపై వేతువు
చెలరేఁగి నిన్ను రట్టుసేయనేఁటికి
సాలసి చల్లగాలికి చోట్లెన్ని గలిగినా
మలయఁ బేరైనచోటు మలయాద్రిగాదా

చ.3:
నింద నీకెంత మోచినా నీవె నన్నుఁ గూడితివి
కందువ నీ గుణాలు పాగడనేఁటికి
యెందరు శ్రీ వెంకటేశ యింతులు గలిగినాను
యిందిరను నీయిల్లు నా యెదలోనె కాదా