పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0133-4 హిందోళవసంతం సంపుటం: 07-196

పల్లవి:
చేసినట్టు తాఁజేసె చేరి నేనూరకుందాన
యీసులెల్లా మానెనిఁక యేమనీనే తాను

చ.1:
తనువుమీఁదటిరేక తప్పులు దిద్దఁగరాదు
మనసులోని నొప్పికి మందులేదు
కనుచూపుఁబోట్లకు గంట్లు చూపఁగరాదు
యెనసి యింకా నాతో యేమనీనే తాను

చ.2:
మొగము లోపలి కళ మూసి దాఁచిపెట్టరాదు
చిగురుఁ గోరికలలో చేఁగలేదు
నగవుల వెన్నెలలు నాములు చూపకపోవు
యెగసక్యములు గావు యేమనీనే తాను

చ.3:
చిత్తము లోపలి సిగ్గు చేతఁబెట్టి చూపరాదు
కొత్త జవ్వనమునకు గురుతులేదు
హత్తి శ్రీ వెంకటేశుఁడు అందుకే తా నన్నుఁగూడె
యిత్తల యీవలపులకేమనీనే తాను