పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0133-3 శ్రీరాగం సంపుటం; 07-195

పల్లవి:
తనకే తెలుసునమ్మ తమకపు వేడుకలు
కొనచూపుల నవ్వీని గోవిందరాజు

చ.1:
పడఁతులిద్దరు తన పాదములొత్తఁగాను
నడుమఁ గొడుకుఁగనె నగుతాఁ దాను
పాడమి కాంతలకుఁగా పురుషుఁడు బిడ్డఁగన్న
కొడిమెలు గట్టుకొనె గోవిందరాజు

చ.2:
సేదదేరి యీచెలుల చేతి చెమటలఁ దోఁగి
పాదాలఁ గూఁతురుఁగనెఁ బైపైఁ దాను
ఆదిగొని మగవాఁడు ఆఁడువారికి వేఁకటై
సాదుఁదనము మోచెనిచ్చట గోవిందరాజు

చ.3:
పెనఁగి లక్ష్మీ భూముల ప్రేమపుటంగాలు సొఁకి
మనసున బిడ్డఁగనె మరిగి తాను
వనితలకు మగఁడు వరుసకానుపుగనె
కొనబు శ్రీ వేంకటాద్రి గోవిందరాజు