పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0133-2 బౌళి సంపుటం: 07-194

పల్లవి:
ఓరుపు గలవారికి వోరుచుకొంటేనే మేలు
యేరితేను మలిగండ్లు యెందులోను లేవే

చ.1:
నారమణునిపైఁ జాడి నాతోనేమి చేప్పీరే
తేరకొన నాచేనేల తిట్టించేరే
గోరుమేననుండదంటా గురుతులేమి చూపేరే
తారి బియ్యము దంచితే తవుడు వెళ్ళకుండునా

చ.2:
భావమిద్దరికొక్కటే పగలేల పుట్టించేరే
ఆవేళ నాచే వెంగెములాడించనేలే
మోవనాడె తని మర్మము లేల తలఁపించేరే
భావించ రత్నాకరానఁ బచ్చి గుల్లలుండవా

చ.3:
గక్కన శ్రీ వేంకటేశుఁ గడునేల నవ్వించేరే
వొక్కటైతేఁ జన్నులచే నొత్తించేరేలే
పెక్కురతులలోనేల పిరివీకు సేయించేరే
గక్కన నీళ్ళ నీడ గానరాక మానునా