పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0133-1 మలహరి సంపుటం: 07-193

పల్లవి:
ఇరుగుపారుగువారు యేమందురే
అరసి నీపై వలపు అందిరపై బూతురా

చ.1:
నిగ్గుల నీ రమణుఁడు నీతో మాటలాడితేను
యెగ్గులు వేరొకతెపై నేలపెట్టేవే
వొగ్గుచు నిన్నాతఁడు వొడివట్టి తీసితేను
బగ్గన నాపె కొంగు పట్టించేవదెమే

చ.2:
తమకించి నిన్నాతఁడు తప్పక చూచితే నెడో
రమణిని దెచ్చి ముందరను దోసేవే
సముకాన కొనగోర సారెనొత్త వచ్చితేను
అమర వేరొకతె మేనటు దాఁకించెవే

చ.3:
శ్రీ వేంకటేశ్వరుఁడు చేరి నిన్నుఁ గూడితేను
వావిరి నాపెకు నేల వంతువెట్టివే
నీ వలమేలుమంగవు నిన్నుర మెక్కించుకొంటే
భూవనితఁ దెచ్చి అట్టే బుజమెక్కించేవే