పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0132-5 పాడి సంపుటం; 07-191

పల్లవి:
నేరుచుకొంటివే మేలు నేఁడే యింతేసి
మేరమీరి సేసినదే మేలుబంతిగాదా

చ.1:
నేనాతనితో నవ్వితే నీవేమనేవే వోసి
కానీవే అన్నియునిఁకఁ గనుకొనేవు
దానికేమే మాటలేల దగ్గరి రావే వోసి
మైనము సూలమౌనటే మాపుదాఁకాను

చ.2:
కాంతునికి నేమొక్కితే కాదనేవటే వొసి
యింత బలవంతురాలవెందు వొయ్యేవే
పంతములన్నియునేరుపరచేలేవే వోసి
యెంత తొండమున్నా దోమ యేనుగవునటే

చ.3:
శ్రీ వేంకటేశుఁడు గూడే చింత నీకేలే వోసి
కైవశము తొల్లేనాకుఁ గదే ఇతఁడు
రావే అక్కచెల్లెండ్లము రవ్వయైతిమే వోసి
నీవు నీరడిచితేను నేఁడు రెండౌనటవే