పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0132-4 సామంతం సంపుటం: 07-190

పల్లవి:
అప్పటి నుండి సిగ్గుతో నవ్వలి మోమైవున్నది
చెప్పరాని ప్రియమెల్ల జెప్పఁగదవయ్యా

చ.1:
వోపననఁగానె నీవు వొడివట్టి తీసితివి
పూప చన్నులు విసికి పాదిగితివి
కోపగించుకొనఁగానే కొనగోర నూఁదితివి
ఆపడఁతినిఁకనైనా నాదరించవయ్యా

చ.2:
చేతులెత్తి మొక్కఁగానె చెనకితివి మర్మము
యేతునఁ బెనఁగి అలయించితివి
కాతరించి తిట్టఁగానే కాఁగిట బిగించితివి
ఆతుమగా మాటలాడి ఆదరించవయ్యా

చ.3:
చాలుఁ జాలుననఁగానె సంగడిఁ బెట్టుకొంటివి
యీలీల శ్రీ వేంకటేశ యేలుకొంటివి
మూలనున్న యాపె నింత ముంగిటను వేసితివి
ఆలినేల రట్టుసేసేవాదరించవయ్యా