పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0132-2 గుండక్రియ సంపుటం: 07-188

పల్లవి:
అందరు సంతోసించేరు యశోదమ్మ వినవమ్మ
కందువైన బిడ్డనిఁ గంటివోయమ్మా

చ.1:
వనకేలి సేయఁబోతే వచ్చి మాఁకులెక్కీని
యెనసి జలకేలిలో యీఁదులాడీని
మునుపె మాకంటె మంచముసపైఁదానె పండుండీని
ఘనుఁడైన యీకృష్ణునిఁ గంటివోయమ్మా

చ.2:
అంగడి బేరము గొంటే అమ్మవచ్చీఁ దానె మాకు
ముంగిటనాలఁ బిండితే ముంతవట్టిని
సింగారించు కొనఁబోతే చీర గట్ట వచ్చీఁదానె
కంగుదేరిన బిడ్డనిఁ గంటివోయమ్మా

చ.3:
కంచము మొదలనుంటేఁ గడియెత్తిపొత్తునను
కొంచి కన్నుమూసితేను కూడీఁ గాఁగిట
యెంచఁగ శ్రీ వేంకటాద్రినిరవై యాడేయట్టి
కాంచనమువంటి బిడ్డఁ గంటివోయమ్మా