పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0132-1 ఖైరవి సంపుటం: 07-187

పల్లవి:
ఆడనుండేమి తగవులట్టే చెప్పేవు
నీడల నిన్నియునాయ నీకడయే యిఁకను

చ.1:
పలుకఁగ నెర్తువు పాదాలు గుద్దనేర్తువు
సాలసి వాకిలి దెరచుక రాఁగదే
అలుక దీర్చఁ గలవు ఆయములంటఁగలవు
బలిమి నీపతితొడపైఁ గూచుండఁగదే

చ.2:
పగడసాలాడుదువు పక్కన నవ్వింతువు
మొగము చూపీతనికి మొక్కఁగదవే
పాగడుదు విచ్చెరిఁగి పాద్దులు గొంతవుత్తువు
మగని ముసుఁ గుదీసి మంతనమాడఁగదే

చ.3:
వీడెము చేతికిత్తువు వెరపులు వాపుదువు
తోడఁ బెండ్లి కూఁతురవై తొక్కవే కాలు
యీడనె శ్రీ వేంకటేశుఁడింతలోనె నన్నుఁగూడె
జాడనేనంతెరఁగను సరస మాడఁగదే