పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0131-5 శంకరాభరణం సంపుటం: 07-185

పల్లవి:
పొంచి నా చన్నులంటేవు పోకముడి జారించేవు
నించే నీ పోందులకు నేనూఁ బైకొసరా

చ.1:
ఇందరు సతులలో నాయెచ్చుకుందులు చూడవు
సందడిఁ గాలుదొక్కేవు సారెసారెకు
చందమైన నీ పాదము సంతముద్రకోలాయ
యిందుకు నేనూ లోనై యిరవుకోవలెనా

చ.2:
జంగిలి కాంతల నెల్లా సంగతులెంచక నీవు
యెంగిలి సేసేవు మోవి యేకముగాను
పంగించ నీనోరు బందెయెద్దుమోరాయ
కంగులేక కదుపునఁ గలపఁగవలెనా

చ.3:
కొలువుకాంతలనెల్లా కొంకక శ్రీ వేంకటేశ
కలగొన నీవురానఁ గాఁగిలించేవు
వలపుల నీ మేను చలివందిలినీడాయ
చెలరేఁగి నిన్నుఁగూడి సేస చల్లవలెనా