పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0131-3 దేవగాంధారి సంపుటం: 07-183

పల్లవి:
కొత్తలు నీ చేఁతలు గోవిందరాజు
పొత్తుల మగఁడవై భోగించే విపుడు

చ.1:
పాదము లిద్దరి మీఁదఁ బంచివేసి చాఁచుకొని
సోదించి నీవిరుమొన సూదివైతివి
సాదించి యిద్దరు చేతి సన్నల నిన్నునొత్తఁగా
దాదాత వలపు దూఁచే తాసు వలెనైతివి

చ.2:
కన్ను సన్నల నిద్దరి కళలు రేఁచి రేఁచి
వన్నెసరసముల కావడివైతివి
అన్నిటా సెలవుల నవ్వాపెకు నీపెకు నిచ్చి
పన్ని రెండు చక్రముల బండివైతివి

చ.3:
అండనె శ్రీ వేంకటేశ అదె గోవిందరాజవై
చండిదీర సిరికి భూసతికి నీవు
రెండు చేతుల యిద్దరికిఁ గాఁగిలిచ్చియిచ్చి
కొండుక జమళి పెండ్లి కొడుకవునైతివి