పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0131-2 మలహరిసంపుటం: 07-182

పల్లవి:
ఏమి సేసెనే విభుఁడు యేఁటికి వేగిరించేవే
భామిని మీలపిల్లలఁ బాలువోసి పెంతురా

చ.1:
ఇంతేసి జక్కవలను యేల గూఁట వేసేవే
పంతపు వాఁడమ్ములేల పారాడించేవే
కాంతుల యద్దములను కవిసెనఁబెట్టనేలే
వింతగాఁ దుమ్మిదపిండు విరియించ నేఁటికే

చ.2:
చిగురుటాకుల తేనె చిందనేల పోసేవే
మొగిచి పట్టఁగనేలే ముంపుదీగెలు
యెగసక్కేనకు బయలేల ముడివేసేవే
జగతిఁ గరికుంభాలు సారెకునూఁదుదురా

చ.3:
బలిమినరంట్లను పక్కనఁ బైఁ దోయనేలే
అలమి యంచులఁ బాతురాడింతురా
అలమేలుమంగవు నీ వాతఁడు శ్రీ వేంకటేశుఁ
డెలమిఁ గూడితిరి మిక్కిలియే వేడుకలా