పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0131-1 భూపాళం సంపుటం: 07-181

పల్లవి:
ఏబాసకియ్యకొనేవే యిప్పుడు నీవు
వాబలిమిమాటల వాదుకోపఁ గాని

చ.1:
నెట్టన నీవు నన్నాడే నిందలెల్లాఁ దప్పదని
చుట్టి మరుగుడి వాసి చొచ్చి వెళ్ళేవా
నట్టనడుమ నేనైనా ననలయలుగులను
కిట్టి నానిజము మించ గెలిచేఁ గాని

చ.2:
ఆలాగువాఁడ నేనని చిలుకజోదుల
వాలు తిరుమిక్కిళ్ళకు (?) వడి నిల్చేవా
వాలాయించి నేనైనా నావల్లఁ గల్లలేకుండా
బాలకోవిలభ్రతముఁ బలీకించేఁ గాని

చ.3:
ఇలనేఁ గపటినని యీపూవుఁ దేనెనీటను
నెలకొని నీవు మునిఁగి లేచేవా
కలసితి నేను శ్రీ వేంకటపతినిప్పుడని
తొలుత నీచన్నుదిబ్బాలు దొడికేఁగాని