పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0130-6 నాదరామక్రియ సంపుటం: 07-180

పల్లవి:
ఇంతబాఁతిపడేవానినేల మాకుఁ దక్కరించ
చెంతనిదే వెన్నచిట్టిఁ జిట్టెఁడేసి వలపు

చ.1:
చేలకొంగువట్టితి సిగ్గువడఁగా మానము
వాలుకరెప్పలు వంచి వంచి చూచేవు
ఆలదొడ్డివారము నేమంతేసి యెఱఁగము
పాలదుత్త దుత్తెఁడేసి పట్టవయ్య వలపు

చ.2:
పెల్లుగ జేతులువాపి పెనఁగగానె గుబ్బలు
కొల్లలుగాఁ జేతఁబట్టి గోర గీరేవు
గొల్లెతలమెఱఁగము గొప్పజాణతనములు
చల్లదుబ్బ దుబ్బెఁడేసి చల్లేము వలపు

చ.3:
కాయపుమదము గారఁగానె శ్రీ వేంకటేశ
సోయఁగానఁ గూడి మరి సోదించేవు
నేయమ్మేవారము నవ్వనేరము పోసేమిదె
చేయిచాఁచు పెరుగుచిప్పఁ జప్పెఁడేసి వలపు