పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0103-5 గౌళ సంపుటం: 07-017

పల్లవి:
వేఱే నేమూరకుండిన వెంగెమే కాదా
నీఱుపైఁ గోపాలు చూప నీయంతవారమా

చ.1:
కొంగువట్టి నిన్నుఁ బేరుకొననైతినని దూరే
వెంగిలి నోరఁ బిలిచేదెగ్గు గాదా
కుంగని కుచాలు దాఁచుకొంటినంట నాడేవు
నింగిమోవఁ బెరుగఁగ నీ యంతవారమా

చ.2:
అంచ నీవొద్దఁ గూచుండనని యలిగేవు నీ
మంచము కాళ్ళఁ దొక్కేది మదము గాదా
అంచు మోవనోరఁగఁగ ఆనుకోనైతిననేవు
నించిన కొండలు మోవ నీయంతవారమా

చ.3:
అమర నీతోఁ బెనఁగనైతినంటా గొణగేవు
చెమటమెయి నీపైమోవ సిబ్బితి గాదా
తమితో శ్రీ వేంకటేశ దక్కి నన్నుఁ గూడితివి
నెమకిప్రేమఁ గూడఁగ నీయంతవారమా