పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0130-4 గుండక్రియ సంపుటం: 07-178

పల్లవి:
తొలుతనే వలచిన తొయ్యలి నేను
మలసి నిన్నుఁ గాదని మారుకొనవచ్చునా

చ.1:
వేడుకతో నీమాటలు వినేదే మేలుగాక
జోడుగూడ నందుఁ గొంత సోదించనేలా
వీడెము చేతికిచ్చితే వేసుకొనుటే కాక
వూడిగము సేసే చెలివొడిఁ బెట్టనేలా

చ.2:
ననిచి నీసేఁతలకు నవ్వేదే మేలుగాక
చెనకి యింతేసి గరిసించఁగనేలా
మొనసాదము చాఁచితే మొక్కేదే తగవుగాక
పెనఁగి అట్టె బటువుబిల్లవెట్టనేలా

చ.3:
గుట్టుతో నీసన్నలకుఁ గూడేదే మేలుగాక
వట్ట సిగ్గుతోఁ దలవంచఁగనేలా
యిట్టె శ్ర వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
బెట్టి మోవితేనిచ్చితే పెరఁబెట్టనేలా