పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0130-3 పాడి సంపుటం; 07-177

పల్లవి:
ఇదిగో నీతగవెల్లానిందులోనే కానవచ్చె
వుదుటు కోడెకాని వోజ యిట్టిదయ్యా

చ.1:
భూములెల్లాఁ జాటించి పూవుదండ మెడవేసి
ప్రేమముతో నిన్నొకాపె పెండ్లాడెను
ఆమేలెరఁగవద్దా అప్పటిఁ బెండ్లాడితివి
యేమయ్యా మగవానికేడ పాటెయ్యా

చ.2:
నయానఁ బందెమువేసి నడుమ మేనపడుచు
ప్రియపడి నిన్ను నిట్టె పెండ్లాడెను
క్రీయ దెలియక వేరే కెలనఁ బెండ్లాడితివి
నయగారిపతినెట్టు నమ్మవచ్చునయ్యా

చ.3:
వున్నతిఁ బుట్టినప్పుడే వురముపై నెలకొని
పిన్ననాఁడె నిన్నాకాపె పెండ్లాడెను
నన్నుఁ బెండ్లాడితివి నంటున శ్రీ వేంకటేశ
యిన్నిటా వేడుకకానికేడ నేమమయ్యా