పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0130-2 మాళవి సంపుటం; 07-176

పల్లవి:
వట్టి దీమసములేలే వనిత నీకు
గుట్టుతోడి నీగుణమక్కునఁ బోసి చూపేనా

చ.1:
అగ్గలపుఁదమకాన ఆతఁడు వీడెమిచ్చితే
వ్‌గ్గి పిడికిటఁ బట్టుకుఁ దానవేమే
సిగ్గులీవేళనేఁటికే సెలవుల నవ్వులేలే
కగ్గి యీతనిమాఁటకుఁ గాదనఁగలవా

చ.2:
కడఁగి నీవేలనుంగరమాతఁడు వెట్టితే
వొడిలోనఁ జెయివెట్టుకుందానవేమె
వెడవెడమోనాలేలే వేసాలు చూపుఁగనేలే
తొడరి యూతనియాన తోయంగఁ గలవా

చ.3:
శ్రీ వేంకటేశుఁడు సేస శిరసుపైఁ జల్లితేను
కూవగాఁ గొప్పులో దాఁచుకొనేవేమే
యీవేళ నన్నేలి మఱి యీతఁడే నిన్నునేలె
సోవలనీతనిమోవిఁ జొక్కకుండఁగలవా