పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0130-1 శంకరాభరణం సంపుటం: 07-175

పల్లవి:
కానవచ్చె నీసుద్దులు కడలనున్నవారికి
ఆనతియ్యవయ్యా మేమునందుకు మెచ్చేము

చ.1:
చిలుకపలుకులకు చెవులొగ్గియాలించేవు
జలజాక్షిమాటలతో సరివచ్చెనా
తలుకొత్త తుమ్మిదలఁ దప్పక చూచేవిట్టె
యెలమినాకెకొప్పుతో యీడువచ్చెనా

చ.2:
చెంది జక్కవలమీఁదఁ జేతులు చాఁచేవు నీవు
యిందుముఖిచన్నులతో నీడువచ్చునా
విందువలె హంసలవెంటవెంటఁ దిరిగేవు
పాంది ఆకెనడపుల పోలికాయనా

చ.3:
బంతిఁ జెకోరములఁ దప్పక చూచేవీరీతి
కాంతకన్నులతోఁ దారుకాణ వచ్చెనా
యింతలో శ్రీ వేంకటేశ యేలితివి నన్నునిట్టె
వింతై నావలెనాకె గోవిలపాట వాడెనా