పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0129-6 హిజ్జిజ్జి సంపుటం; 07-174

పల్లవి:
ఎంత చనవిచ్చితివి యీపెకు నీవు
వంతులకు వట్టివళావళ్ళు సేసీనిపుడు

చ.1:
పవళించి నీవుండఁగా పడఁతికొలువులోన
చెవిలోన విన్నపాలు సేసీనీకె
తవిలి యొకతెపై పాదము నీవు చాఁచఁగాను
తివిరి వేళ్ళ చిటిక దియ్యవచ్చీ నీకును

చ.2:
వెలఁదులచే నీవు వీణె వాయింపించుకోఁగా
కిలకిల నవ్వు నవ్వి కెలసీనీపె
నెలవుగాఁ గప్పురము నీవొకతెకియ్యఁగాను
తొలుత నడుముదూరి దోసిలొగ్గీనిపుడు

చ.3:
అడపపుటింతిచేత ఆకు నీవందుకోఁగాను
వెడఁగుఁదనాన తెర వేసీనీపె
అడరి శ్రీ వేంకటేశ అంతలో నన్నేలితివి
బడివాయక తాను నీపానుపెక్కేనిపుడు