పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0129-4 శంకరాభరణం సంపుటం: 07-172

పల్లవి:
ఏఁటికింకా నీవిభునినేల దూరేవే
గాఁట్టపు మదమునను గరిసించనేఁటికే

చ.1:
కగ్గులెని జక్కవలు ఘనాలని పాగడితే
సిగ్గువడనేమిటికే చెలియ నీకు
నిగ్గుల తుమ్మిదలను నెట్టుకొని మెచ్చితేను
తగ్గి బొమ్మజంకెనల తాటించనేఁటికే

చ.2:
అడవిలోని సింహమును అట్టె చేతఁబట్టితేను
గుడిగొన నాయకునిఁ గొసరనేలే
తడవి లేఁదీగెల మొదళ్ళు గోరనొత్తితేను
వుడిగుడిగి నీపెదవులఁ దిట్టునేఁటికే

చ.3:
ఆరఁటులుఁ జిగురులునాసపడి చూచితేను
నెరవుతోడుతఁ దెరవేయనేఁటికే
అరిది శ్రీ వేంకటేశుఁడలమేల్మంగవు నిన్ను
సరవిఁ గూడెను యింకా సాదించనేఁటికే