పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0128-6 బౌొళి సంపుటం: 07-168

పల్లవి:
అన్నిటా భాగ్యవంతుఁడవవుదువయ్యా
పన్నినందుకల్లా వచ్చు భామ నీకునిపుడు

చ.1:
పడతి మోహరసము పన్నీటిమజ్జనము
కడలేని యాపెసిగ్గు కప్పురకాపు
నిడుదకన్నుచూపులు నించినతట్టుపునుఁగు
తొడిఁబడ సులభాన దొరక నీకిపుడు

చ.2:
కామినికెమ్మోవికాంతి కట్టుకొనే చంద్రగావి
ఆముకొన్న మోహకళలాభరణాలు
దోమటిమాటలవిందు ధూపదీపనైవేద్యాలు
కామించినటువలెనె కలిగె నీకిపుడు

చ.3:
అలమేలుమంగనవ్వులంగవు పువ్వుదండలు
కలసి వురాన నీకే కట్టినతాళి
చలపట్టి యీకెరతి సకలసంపదలు
యిలనబ్బె శ్రీ వేంకటేశ నీకు నిపుడు