పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0128-5 పాడి సంపుటం; 07-167

పల్లవి:
ఏల కొంగువట్టేవు యెమ్మెకాఁడా
నీలాగులిట్లానా నీటుకాఁడా

చ.1:
గొల్లచల్ల నెత్తిఁబెట్టుకొని నీకునమ్మరాఁగా
చల్లులాడేవేమోయి జాజరకాఁడా
పుల్లలనొత్తిన పచ్చి పునుఁగు గని తేఁగాను
వొళ్ళ (ల్ల?) నాకేల పూసేవు వుదుటుకాఁడా

చ.2:
పదిలానఁ బాలపండ్లు పయ్యెదలోఁ గొంటా రాఁగా
అదేల పిసికేవోయి ఆగడీఁడ
పాదల పువ్వులుగోసి పొత్తరగట్టుకుండఁగా
వెదచల్లుదురా నాపై వేసాలవాఁడా

చ.3:
వొలిసి పులిజూజము వొడిఁగట్టుకొని రాఁగా
అలరి నన్నాడించేవు అందగాఁడా
యెలమి శ్రీ వేంకటేశ యేలితివి నే మొక్కఁగా
అలమేవు కమ్మటినాసోదకాఁడా