పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0128-4 ముఖారి సంపుటం: 07-166

పల్లవి:
సుదతి సింగారాలు చూడరమ్మ చెలులాల
మదనుబలాల మారుములయవలసెను

చ.1:
జక్కవలె చన్నులై జంటవాయకుండఁగాను
పక్కనఁ గొండలతోడి పంగెమేఁటికే
నిక్కిచందురుఁడే మోమై నిండుఁగళలుదేరఁగ
పుక్కటనద్దముతోడి పురుడేఁటికే

చ.2:
తుమ్మిదలె తురుమై తోదోపులాడఁగాను
సమ్మతిఁ జీఁకటితోడి సడ్డయేఁటికే
నెమ్మదిని సింహమే నెన్నడుమై వుండఁగాను
వుమ్మిడినాకసముతో వుపమేఁటికే

చ.3:
చిగురులే పాదములై చెలువములు చూపఁగా
పాగరుఁదామరలతో పొందులేఁటికే
జిగి నేఁడీయింతితోడ శ్రీ వేంకటేశుఁడు గూడె
తగునంటానెన్నైనానందాలు చెప్పసేఁటికే