పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0128-3 బౌళి సంపుటం: 07-165

పల్లవి:
ఇందాఁకానెరఁగనైతి నీవుపాయము
కందువలంటినప్పుడు గాక లోనౌనటవే

చ.1:
అడరి యెవ్వతోయింటికరిగేవేళ విభుని
వడిఁ జేపట్టి తీసితే నచ్చీనటే
బడినే యరిగి యాకెఁ బచారించి యానవెట్టి
కడుబలిమిఁ గూడినఁగాక వీఁడబ్బునటే

చ.2:
నలువంక సతులతో నవ్వులు నవ్వేటివేళ
పలుమారుఁ బిలిచినఁ బలికీనటే
యెలయించి వొక్కనినె యేకతమునకుఁ దీసి
యెలమిఁ జన్నులనొత్తకితఁడు చిక్కునటే

చ.3:
అత్తలవిందియ్యకొన్నయట్టి శ్రీ వేంకటేశుఁడు
పొత్తులకుఁ బిలిచితే భుజించీనటే
బత్తితోఁ గూడితిఁ దనపచ్చడము ముసుఁగిడి
కొత్తయింతసేయకతానేకొంకుదేరునటవే