పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0128-1 సామంతం సంపుటం: 07-163

పల్లవి:
తనతో పంతములాడేదాననా నేను
పనులు పదిమారులు పచరించేవాఁడు

చ.1:
వాడికమాటలఁ జొక్కి వలకు లోనైనవాఁడు
వోడక రాళ్ళుదేలించనోపినవాఁడు
జాడతో భూమెల్లా ముకుచాయనె యేలినవాఁడు
వేడుకఁ గంబసూత్రపువేసాలవాఁడు

చ.2:
పసలేని యాసలకు బయలువాఁకేవాఁడు
ముసరుకొన్న చలాల మునిఁగేవాఁడు
సుసరాన నమ్మలేక సాంట్లు సోదించేవాఁడు
ముసలిఁ గన్యకఁజేసి మోహించినవాఁడు

చ.3:
వెనక ముందరసేసి వెలఁదులఁ గూడేవాఁడు
కనుసన్నలఁ దిరిగే కలికి వాఁడు
అనిశము శ్రీ వేంకటాద్రిమీఁదటివాఁడు
ననుఁ గూడి నెలకొన్న నయగారివాఁడు