పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0127-5 సామంతం సంపుటం: 07-161

పల్లవి:
సందు సుడివలపుల జాజరకాఁడ
యిందరిపైనడియాసలేల చూపేవయ్యా

చ.1:
వరుసకు వచ్చినాపె వద్దనే వుండఁగాను
యిరుగు పారుగులాపె యేఁకారఁగాను
సరిఁ గానుకిచ్చినాపె సారెకుఁ జూడఁగాను
గొరబుగ నన్నునేల కొంగువట్టేవయ్యా

చ.2:
సన్నలు సేసినయాపె సముకాననుండఁగాను
కన్నుల మొక్కినయాపె కాచుకుండఁగా
కిన్నరమీంట్లయాపె గిలిగింతలు సేయఁగా
చిన్నదాన నాపైనేల చేయిచాఁచేవయ్యా

చ.3:
ఇంటిలోననున్నయాపె యెదురులు చూడఁగాను
జంటయై పెండ్లాడినాపె సాదించఁగాను
నంటున శ్రీ వేంకటేశ నన్ను నీకాఁగిటఁ గూడి
అంటి ముట్టి నన్నునెంత ఆదరించేవయ్యా