పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0127-4 ధన్నాశి సంపుటం; 07-160

పల్లవి:
ఒక్కటి విన్నపమే వున్నమాటఁలికనేల
యిక్కువతొ రమణునికెరుంగించఁ గదవే

చ.1:
యెడమాటలాడేనంటే యోందాఁకఁ దిరుగవచ్చు
నడుమఁ దనచిత్తము నాభాగ్యము
తడయక చూచెనంటే తనివి యెంతటఁ గల్లు
చిడిముడి నాచనవు చెల్లించుమనఁగదే

చ.2:
యెలమిఁ బెనఁగేనంటే యెంతటఁ దీరీనాస
బలిమికాఁడు తాను భాపను నేను
వెలయఁ బిలిచేనంటే వేళయెట్టుగాఁ దెలిసు
తలకొని ననునిట్టే దయఁజూడమనుమీ

చ.3:
వెఁస బెండ్లాయాడేనంటే వేడుకకు విలువేది
వనమాయఁ దా నాకు వలపు నాది
యెసగి శ్రీవేంకటేశుఁడేలే నన్ను దూరనేల
పాసఁగ నన్నియనిట్టే భోగించు మనవే