పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0127-1 గుండక్రియ సంపుటం; 07-157

పల్లవి:
భావమెరఁగనివారు పచ్చెందురుగాని గోరు
తావులెరిఁగితే సురతపుసామ్ము గోరు

చ.1:
అలిగినవేళలనంటకుండాఁ జిమ్ము గోరు
వలపు నిలుపరాక వడిఁజాఁచేదొక గోరు
చలపట్టి వేరొకతె జగడము దీసే గోరు
బలిమి పంతానకుపచరించేది గోరు

చ.2:
శిరసువంపులలోని సిగ్గులు వాపేది గోరు
సరిఁ బరవశములెచ్చరించు గోరు
వొరసీతే గురిసేను నుబ్బుఁగవణపు గోరు
సరసమాడేవేళ చవిరేఁచు గోరు

చ.3:
సమ్మతించకుంటేఁ దాఁకి జంటకు లోఁజేసు గోరు
పమ్మి మనసుకుఁ జలివాపు గోరు
దిమ్ముల వయోమదము తెలియని సాక్షి గోరు
కొమ్మ శ్రీ వేంకటేశుతోఁ గూడే యిక్కువ గోరు