పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0126-3 గౌళ సంపుటం: 07-153

పల్లవి:
ఇద్దరికి మీకుఁ దగునింతలేసి
బద్దులేల నెరపేవు బారెఁడేసి

చ.1:
నెలకొన్న సేఁతలు నీవేమి సేసితివా
సెలవుల నవ్వీనాపె చేటఁడేసి
మలసి మలసి నీవు మర్శ్మములెట్టఁటితివో
కులికీని సిగ్గులెల్లా గుంపెఁడేసి

చ.2:
సందడి మీ కెటువలె సమ్మతులైనవొ కాని
కందువమాఁటలాడీని గాదెఁడేసి
మందలించి నీవెంత మరిగించితివొ నేఁడు
పాందులు చూపీనిట్టే పుట్టెఁడేసి

చ.3:
మంచముపై రతినెంత మనసు గరఁగించితివొ
వంచీఁ జూపులు నీపై వామెఁడేసి
యెంచఁగ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నించి వలపులెల్లా నిలివెఁడేసి