పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0126-2 గుజ్జరి సంపుటం: 07-152

పల్లవి:
తనిసినదాఁకా తానే తగులుఁ గాక
కనుఁగొన్నవారికేల కాఁతాళించఁగను

చ.1:
యేడలేని సతులఁ దానెందరిఁ బెండ్లాడినాను
వాడవారికేమి వోదు వద్దనఁగను
జాడతోడ జవ్వనుల చన్నులాతఁడు మోచితే
వేడుకకత్తెలకేల వేఁగు వచ్చెనే

చ.2:
నారుకొన నెన్నికంకణాలు దాఁగట్టుకొనినా
వూరివారికేమిటికే వుప్పతించను
కోరి కొమ్మలచే మోవిగురుతులు సేయించుకొంటే
పేరటాండ్లకేమిటికే పెదవులు విరుచ

చ.3:
వరుసలు వెట్టుకొని వనితలఁ గూడఁగాను
పారుగువారికినేలే బుద్దిచెప్పను
యిరవై శ్రీ వేంకటేశుఁడేతఁడిట్టే నన్నునేలె
యెరవులవారికేలే యేఁకట చూపఁగను