పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0126-1 శంకరాభరణం సంపుటం: 07-151

పల్లవి:
దొరవైతేనేమాయ దోసమా మీలో మీకు
యెరవులేనిచోటికి యితవులే కావా

చ.1:
పలుమారునాపెనిట్టే పాటలు వాడుమనేవు
మెలుపున నీవు దండె మీటరాదా
చెలువుఁడవీమాటకు సిగ్గువడేవదియేమీ
కలుపుకోలైన మేళగాఁడవు గావా

చ.2:
అంతలోనే పగడసాలాడుమనేవాకెను
యింతి యలసెఁ బాసికలెత్తియ్యరాదా
పంతాన నామోము తప్పక చూచేవదియేమీ
వంతుకుఁ బాగకాఁడవీవల నీవేకావా

చ.3:
పొందుగా పరిమళము పూయమని పెనఁగేవు
గందము దీసిచ్చి పాదుగఁగరాదా
చెంది నన్నుఁ గూడితివి శ్రీ వేంకటేశ యేమీ
యిందుకునందుకు నీవే హితుఁడవు గావా