పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0125-5 కాంబోది సంపుటం: 07-149

పల్లవి:
వేసాలు వేయఁగనేలే వేడుకకాఁడు
రాసులు వోశున్నవవే రచ్చలఁ దనబాసలు

చ.1:
మంతనములేలాడీనే మగువలతో నెల్లాను
సంతలోని వలపుల జాజరకాఁడు
వింతలెవ్వరితోఁ జేసీ విద్యలన్నీ నెఱుఁగుదు
దొంతిఁ బెట్టుకున్నదాన తొంటితనసుద్దులు

చ.2:
ప్రియముతో వావులేల పెనచీనే చెలులతో
బయలీఁతనగవుల బచ్చెనకాఁడు
నయములెంత చూపీనే నాకుఁదెలుసునన్నియు
క్రయముగాఁ గొంటిఁ దనకందువమర్శములు

చ.3:
జాడనింతులకు మోవిచవులేల చూపీనే
గాడిఁగట్టుకూటముల కతలకాఁడు
యీడనే శ్రీ వేంకటేశుఁడేలినాఁడు నన్నునిట్టే
కూడపెట్టుకొంటిఁ దనగురుతైన చేఁతలు