పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0125-2 శంకరాభరణం సంపుటం: 07-146

పల్లవి:
మరగి నాపాందె నీకు మాటుమందు
సరుసనిద్దరమును సతులమె కామా

చ.1:
వెన్నెలబాయిట నీవు వెలఁదిఁ దలఁచుకొని
వన్నెకాఁడ విరహాన వడదాఁకేవు
నన్ను నాకెమారుగా మనసున నిలుపుకొని
చెన్నుమీరఁ గాఁక చల్లఁజేసుకొనరాదా

చ.2:
సింగారపుఁదోఁటలోన చెలిని దవ్వులఁ జూచి
అంగపుఁజెమటనుస్సురస్సురనేవు
చెంగట నన్ను నాకె చెల్లెలిఁగా భావించుక
సంగడినలపార్చుక సంతోసించరాదా

చ.3:
ఇందుకాంతవేదిపైనింతితోడ మాఁటలాడి
కందువలు గరఁగుచుఁ గాఁగలించేవు
పాందితివి నన్ను నాకె పోలికలకే నీవు
అందపు శ్రీ వేంకటేశ అట్టే కానీరాదా