పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0124-5 వరాళి సంపుటం: 07-143

పల్లవి:
ఇప్పుడే యేల పెనఁగేవీకెతో నీవు
లప్పలకప్రమచ్చి యలపు దీర్చవయ్యా

చ.1:
కలకల నవ్వుతాను కాంత పరువున వచ్చి
బలిమిఁ గాఁగిట నిన్ను నలమఁగాను
వెలయంగఁ గొప్పు విడి విరులు జల్లున రాలె
ములువాడిగోళ్ళదువ్విముడువవయ్యా

చ.2:
వొట్టువెట్టి పోకుమని వొడివట్టుకొని నిన్ను
దిట్టయై తెరలోనికిఁ దియ్యఁగాను
గుట్టునఁ బయ్యదెడలి కుచములు గానవచ్చె
జట్టిగొని వూరడించి చక్కఁబెట్టవయ్యా

చ.3:
గయ్యాళితనముచూపి కళలంటి రతిసెసి
నెయ్యపుమోవితేనెలు నించఁగాను
చయ్యన శ్రీ వెంకటేశ సరులెల్లాఁ బెనగొనె
యియ్యడఁ జిక్కుదీరిచి యేలుకొనవయ్యా