పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0124-4 హిజ్జిజి సంపుటం; 07-142

పల్లవి:
నీవే విచారించుకొమ్మా నెఱజాణవు
యీవేళఁ జెలియమోహమిచ్చగించవచ్చును

చ.1:
చెంతనుండి కొలువులు సేసేటిరమణితో
పంతమాడవద్దుగాని పనిగొనవచ్చును
మంతనాన నీతో మనవి చేప్పేవేళను
వింతసేయవద్దుగాని వీనులొగ్గవచ్చును

చ.2:
కోరి నిన్ను వేఁడుకొంటా గుట్టుతోనున్న చెలిని
జేరఁదీయవద్దుగాని చెక్కునొక్కవచ్చును
వూరకైన వట్టితేనెలూర మాటలాడి చప్పు
చారు సేయవద్దుగాని చవిగొనవచ్చును

చ.3:
తాలీమితో కౌఁగిటికి తమకించే వనితను
జాలిఁబెట్టవద్దుగాని చన్నులంటవచ్చును
యేలితివి శ్రీ వేంకటేశ యిన్నిటానీకెను
బేలుఁజేయవద్దుగాని ప్రేమ నించవచ్చును