పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0124-3 ముఖారి సంపుటం: 07-141

పల్లవి:
ఇంకనేల దాఁచేవు యిన్నియు నెరుంగుదుము
కొంకు గొసరెల్లాఁ దీరె కోడెకాఁడా

చ.1:
మచ్చికైన యీయింతిమాఁటలచవులఁ జొక్కి
వచ్చినదెరఁగమా వన్నెకాఁడ
యిచ్చగించి యేపొద్దు యీపెచన్నుఁగవకే
పచ్చారేది యెఱఁగమా పంతగాఁడా

చ.2:
నంటున యీపె సెలవి నవ్వుల పసఁ దగిలి
యింటనుండేదెఱఁగమా యెమ్మెకాఁడ
జంటల నప్పటిఁ గన్నుసన్నలకు లోనై
వెంట వచ్చేదెఱఁగమా వేడుకకాఁడా

చ.3:
దినదినమీ పె మోవితేనెలకాసపడేవు
మనసు నేమెరఁగమా మాయకాఁడ
యెనసితి విటు నన్ను యిప్పుడె శ్రీ వేంకటేశ
ఘనుఁడ నిన్నెరఁగమా కతలకాఁడా