పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0124-2 ఖైరవి సంపుటం: 07-140

పల్లవి:
ఎంతవాఁడవయ్య నీవు యేమని పాగడుదును
పొంతనే నీమేలక్కునంబోసి చూపవచ్చును

చ.1:
గొంటరిసతులు నిన్నుఁ గొసరుదురింతెకాని
నంటున నీబాసలన్నీ నమ్మవచ్చును
వొంటిఁ జిక్కించుక నిన్నునొారయుదురింతెకాని
జంట నీమంచితనాలు చాటించవచ్చును

చ.2:
నాలికత్తెలు నీమాఁట నవ్వుదురింతెకాని
వాలాయించి మంత్రముగా వ్రాయవచ్చును
పోలించి మంచిగుణాలు బోధించవత్తురుగాని
మేలిమి నీకీర్తెల్లా మెఱయించవచ్చును

చ.3:
తక్కరికాంతలు నీతో తమకింతురింతె కాని
పెక్కు నీరతులు దొంతిఁ బెట్టవచ్చును
అక్కరతో శ్రీ వెంకటాధిప నన్నేలితివి
వెక్కసపు నీమహిమ వెలయించవచ్చును