పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0122-6 ఆహిరి సంపుటం; 07-132

పల్లవి:
బాపురే నేమచ్చితిని భాగ్యమాయను
ఆపె భోగించినవి నీకందమాయను

చ.1:
వనిత చెక్కులవెంట వడిసే జవ్వాదినే
మినుకై నీమేనెల్లా మెఱుఁగాయను
పెనఁగులాడేటివేళ బెరసిన చెమటల
పనుపడి నీతమికిఁ బదనాయను

చ.2:
రమణి కొప్పువిరులు రాలి నీపైఁ జిందఁగాను
సమరతివెట్ట దీరి చలనాయను
జమళి సరసమాడ చన్నుల కస్తూరిపూఁత
అమరి నీవురమున కడియాలమాయను

చ.3:
పడఁతిమోవితేనెలు పలుమారు నీకియ్యఁగా
విడువని నీపాందుకు విందులాయను
అడరి శ్రీ వేంకటేశ అట్టె నన్నునేలితివి
బడిబడినే మేలు పైకొసరాయను