పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0122-5 శ్రీరాగం సంపుటం: 07-131

పల్లవి:
కంటిమి నేమీభాగ్యము కన్నుల తుదలను నీఁడిదె
జంటలు నీకీవిద్దెలు సాజమె కదవయ్యా

చ.1:
విందులమోవులయీవులు వీఁపుననానినకుచములు
పాందులకొనగోరొత్తులు పాలఁతికి నీకమరె
చిందేటి నెలవుల నవ్వులు సిగ్గుల మోముల వంపులు
కందుననుండెడి యీచెలికత్తియలకు నమరె

చ.2:
తొడఁదొడ మోచినమేలముదోమటివీడెపుటుదుటులు
జడిగొను చూపుల ననుపులు సతికిని నీకమరె
యెడనెడఁ బయ్యెదమరఁగులు యెఱుఁగమి సేయు పరాకులు
ఆడియాలపుమీకొలువులయంగనలకు నమరె

చ.3:
ఆయములంటినమఱపులు నడఁచియు నడఁచని వూర్చులు
యీయెడ శ్రీ వేంకటేశ యిద్దరికిదె యమరె
చాయల సన్నలపదరులు సరిఁదెరవాల్చిన నేర్చులు
పాయని నీవూడిగముల పడఁతుకలకునమరె