పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0122-4 హిజ్జిజి సంపుటం; 07-130

పల్లవి:
ఎప్పుడును దొరలతో యేలాటములైనా మేలు
చప్పనైన నీచులతో సంగాతాలకంటెను

చ.1:
జక్కవపులుగులు నీచన్నులకు నోడినాను
పెక్కుదేశములనెల్లాఁ బేరుపడెఁగా
నిక్కి తుమ్మిదలు నీనెరులకెన రాకున్నా
మిక్కిలి మొరసెననే మేకులైనాఁ గల్లెఁగా

చ.2:
చందురుఁడు నీమొగముతో సరిరాకున్నా లోలో
కుందుచునుపమలకు గుఱుతాయఁగా
నిందతోడ సింహము నీనడుముఁ బోలకున్నా
యెందుఁ దలఁపించుకొని యీడువెట్టుకొనెఁగా

చ.3:
అంచలు నీనడపుల అందములు రాకున్నా
యెంచి కవితలలోన నిరవాయఁగా
నించి శ్రీ వేంకటేశుఁడు నీకౌఁగిటఁ గూడినాను
పెంచెపుటురాన నిన్ను బెట్టుకొనెఁగా