పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0122-3 నాదరామక్రియ సంపుటం: 7-129

పల్లవి
చెప్పరాదు నీవుండేటి చెలువములు
చిప్పిలీ నీమేననెల్లా సింగారాలు

చ.1:
కతలుగాఁ బానుపుపై కాఁగిటఁ బెనఁగేవేళ
సతిచెమటే పన్నీటి జలకములు
యితవుగా లోలోన యెనసి వుండేటివేళ
గతిగూడ నవ్వేనవ్వు కప్పురకాపు

చ.2:
సాలసి సాలసి నీతో జోడైవుండేటివేళ
తలిరుంబోడిచూపులే తట్టుపుణుఁగు
వులుకనితమకాన వురమెక్కినట్టివేళ
నిలువుమేనికాంతి నీమేని సొమ్ములు

చ.3:
అంగపురతులఁ గూడి అలసివుండెటివేళ
అంగనమోవితీపులే యారగింపులు
చెంగటనలమేల్‌ మంగ శ్రీ వేంకటేశ నిన్ను
నంగవించి కూడె నీవే యఖిలభోగాలు