పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0102-6 ముఖారి సంపుటం: 07-012

పల్లవి:
అంది వాదులకు వచ్చేవదేమోపే
మంద పసులు దవ్వేఁగ మమ్ము విడవోపే

చ.1:
పేయ చొరఁగానె యిల్లు బెంబడీఁ జొచ్చితిఁగాక
ఆయెడ నన్నేల తిట్టేవదే మోపె
చాయలనా పుట్టుచెండు చవి నేనంటితిఁగాక
మాయల నీ చన్నులంట మాకేలవోపే

చ.2:
బచ్చెన మంచము దాఁకి పైఁబడితి నీ వుండేది
యచ్చట నెవ్వఁడెఱుఁగునదేమోపే
పెచ్చుఁబిల్లఁగోవెనుచుఁ బెదవిమోఁపితిఁగాక
పచ్చి నీమోవనెఱిఁగే పని మాకేలోపే

చ.3:
ముందర నీతొడదాఁకి మొలగంట వాఁగెఁగాక
అందుకు నన్నంటఁబట్టేవదేమోపే
అంది శ్రీ వేంకటపతి ననక తోదోపులనె
సందడిఁ బెనఁగితివి చాలదా వోపే