పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0122-2 ముఖారి సంపుటం: 07-128

పల్లవి:
నేనూ నీదేవులనే నిండుకవుండుట మేలు
పేని పట్టి యిందుకేల పిలిచేవు నీవు

చ.1:
మగువలకు నీకును మాపుదాఁకాఁ గొచ్చి కొచ్చి
తగవులు చెప్పనేల తడవనేల
వెగటుగా మీలోమీరు వేసాలకునలిగితే
పగటుతోనింతవొడఁబరచఁగనేలా

చ.2:
పోసరించి వూరివారి పొందులు నేయించి నీచే
బాసలు సేయించనేల పరచనేల
బేసబెళ్లితనముల పెనఁగులాడఁగ మిమ్ము
తోసుకవచ్చి యడ్డము తూర నాకేలా

చ.3:
అవ్వలిమోమైన మిమ్ము నాఁకలి గొంటిరంటా
బువ్వానఁ బెట్టఁగనేల పాదుగనేల
యివ్వల శ్రీ వేంకటేశ యేలితివి నన్నునిట్టే
రవ్వల మీరతులెల్లా రాఁపు సేయనేలా