పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0121-2 సామంతం సంపుటం; 07-122

పల్లవి:
దవ్వుల వీఁగక దండకుఁ జేరరె
వువ్విళ్ళూరుచు నొదుగరె మీరు

చ.1:
చెలువులు రాతిరి చేసిన చేఁతలు
చెలితో వేగిటు చెప్పె సతి
జల జల నంతలో జడివట్టెఁ జెమట
వెలఁదులు సురటి విసరరె మీరు

చ.2:
కాంతుఁడే కాంతముగాఁ జెప్పిన కత
సంతోసమునఁ జెప్పె సకితోను
పొంతనె దొంతర పులకలు వొడమెను
వింతలుగాఁ దెరవేయరె మీరు

చ.3:
శ్రీ వేంకటేశుఁడు చెందిన కలయిక
వావిరిఁ జెప్పం సవతితోను
చేవల నవ్వులు సెలవులఁ బొడమెను
భావించి మొక్కరె పలుమరు మీరు