పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0121-1 దేసాళం సంపుటం: 07-121

పల్లవి:
ఆలీకి మగనికి నాఱడేఁటికే
తాలిమితోడ లోలో తనివందరాదా

చ.1:
దొంతిఁబెట్ట వలపులు తోరపు బూజగుండలా
పంతాలు సంగడిఁ బార బండికండ్లా
యింతేసి మీరిద్దరును యేఁటికిఁ బెచ్చు రేఁగేరు
యెంతకెంత సేసేరు యెనసి వుండరాదా

చ.2:
మమతలు పేరఁబెట్ట మందలపాలా యేమి
తమకము తులదూఁచ తాసుచిప్పలా
జమళినిద్దరూనెంత సరులకుఁ బెనఁగేరు
తిమురనేఁటికి మీలో దిందుపడరాదా

చ.3:
సరిబేసి మాటలాడ జంట జూజాలా యివి
సిరులతోఁ బెనఁగఁగ జెట్టిసాదనా
గరిమె శ్రీ వేంకటేశ కాంతా నీవుఁ గూడితిరి
గరువాలేఁటికి నింకాఁ గలయఁగ రాదా