పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0102-5 రామక్రియ సంపుటం: 07-011

పల్లవి:
అంగన యెట్టుండినా నమరుఁగాక
సంగతే నీకు నాపె సాటికిఁ బెనఁగను

చ.1:
తనకుఁ బోఁదైనచోట తగిలి మాటాడకున్న
మనుజుఁడా వాఁడు పెద్దమాకు గాక
చనవునఁ బెనఁగఁగా సమ్మతించకుండితేను
ఘనత యేది? చులకఁదనమే కాక

చ.2:
చెల్లుబడి గలచోట సిగ్గులు విడువకున్న
బల్లిదుఁడా వాఁడు కడు పందగాక
వెల్లివిరి నవ్వఁగాను వీడుదోళ్ళాడకున్న
చల్లెటి వలపులేవి? సటలింతే కాక

చ.3:
తారుకాణలైనచోట తమకించి కూడకున్న
చేరఁగ జాణఁడా గోడవేరుపు గాక
యీరీతి శ్రీ వేంకటేశ యిట్టె రఘునాథుఁడవై
కూరిమిఁ గూడితివిది కొత్తలింతే కాక