పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0120-4 సాళంగనాట సంపుటం: 07-118

పల్లవి:
ఇట్టుండవలదా యిరవైన మోహము
వొట్టుకొనీఁ జెమటలు ఉవ్విళ్ళూరను

చ.1:
తలపోసి తలపోసి తనువెల్లాఁ బులకించి
వలపులఁ బొద్దువుచ్చీ వనిత
నెలకొని పానుపుపై నిద్దిరించి నిద్దిరించి
కలలోన నిన్సుఁ గూడీఁ గామిని

చ.2:
నీ పదాలు పాడీ పాడి నెయ్యమునఁ గరఁగుచు
రాపుగానానందించీ రమణి
చూపుల నెదురు చూచి చూచి యంతలోనె తరి
తీపులనే తనిసీని తెఱవ

చ.3:
వచ్చివచ్చి నీతోడ వన్నెగా సరసమాడి
మెచ్చీనిదివో యలమేలుమంగ
యిచ్చకుఁడ శ్రీ వేంకటేశ నిన్నిపుడు గూడి
నిచ్చలు నిన్నుభోగించీ నీ పట్టపుదేవి