పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0120-3 గౌళ సంపుటం: 07-117

పల్లవి:
ఔనయ్య మంచివాఁడవన్నిటా నీవు
వేనలి ముట్టి చెలిని వేడుక చేసేవు

చ.1:
అందలమెక్కన నిన్ను ఆకె గొలిచి రాఁగాను
పాందుగాఁ జన్నులొత్తేవు బొట్టనవేల
అందుకుఁగా వేరొక్కతె అట్టె నిన్ను సాదించితే
విందువలె నాపె చెక్కు వేలనొత్తేవు

చ.2:
కుంచె వేసే యట్టి యాపె కుచ్చలమీఁద మోచేత
అంచలనూఁదుకొనేవు ఆయాలు సోఁక
పొంచి వేరొక్కతె నిన్ను బొమల జంకించితే
చంచుల మోవి చూపి సన్నచేసవు

చ.3:
కాళాంజివట్టే సతికైదండ వట్టుకొని
గోలవై శ్రీ వేంకటేశ గోరనూదేవు
మేలుతో నలమేలుమంగ మెచ్చికౌఁగలించుకొంటే
యీలీల నురముమీఁద నెక్కించుకొనేవు