పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0120-1 ఆహిరి సంపుటం: 07-115

పల్లవి:
ఏమి గట్టుకొనేవయ్య యిందువంకను
కామినులనింతసేయఁ గడు దోసమనరా

చ.1:
కమ్మి నీకు మోహించి కానుకియ్యఁగాని వట్టి
కొమ్మల నిమ్మపండ్లందుకొమ్మందురా
వుమ్మడిఁ జూచినవారు వొల్లనాలు గాఁగాను
యెమ్మెలకిప్పుడితఁడింత సేసెననరా

చ.2:
అప్పటినుండియు నేనాకు మడిచియ్యఁగాను
దెప్పరమీతమ్మ వొక్కతెకిడుదురా
కప్పితోడివారీపెపై చప్పని వలపు గాఁగా
చిప్పిలి యింతేసి కాకు సేసెనితఁడనరా

చ.3:
కైకొని శ్రీ వేంకటేశ కౌఁగిటఁ గూడుండఁగా
ఆకడనొక్కతె మాటలాలకింతురా
ఈకడ విన్నవారెల్లా నిది మేలుదిగాఁగాను
దీకొని యీతఁడు తరితీపు సేసెననరా